telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుట్టినరోజు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన తలైవా

Rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నారు. “దర్బార్” చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు పూర్తి రాజ‌కీయాల‌లోకి రానున్నార‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి, దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డం లేదు. కొన్నాళ్ళుగా స‌స్పెన్స్ పెడుతూ వ‌స్తున్న త‌లైవా త‌న పార్టీ గ్రౌండ్ వ‌ర్క్ మాత్రం ముమ్మ‌రంగానే జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది. సొంత పార్టీ పెడ‌తార‌ని అభిమానులు భావించ‌గా, ఇటీవ‌ల తాను క‌మ‌ల్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని ర‌జ‌నీ పేర్కొన్నారు. అయితే ర‌జ‌నీకాంత్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో ఉంటారు. దేశ విదేశాల‌లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఆయ‌న చాలా సింపుల్‌గా ఉంటారు. ఎలాంటి ఆడంబ‌రాల‌కి పోరు. బ‌ర్త్‌డేలు లాంటి వేడుక‌లు జ‌రుపుకోరు. అభిమానులు ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ని ఎంతో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తున్న‌ప్ప‌టికి, ర‌జనీకాంత్ మాత్రం కొన్ని సంవ‌త్స‌రాలుగా త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ని ఇండియాలో జ‌రుపుకోవ‌డం లేదు. అయితే ఈ సారి కూడా ఆయ‌న బ‌ర్త్‌డే వేడుక‌కి దూరంగా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. డిసెంబ‌ర్ 12 ర‌జ‌నీకాంత్ బ‌ర్త్‌డే. ఆయ‌న జ‌న్మ న‌క్ష‌త్రం శ్రావ‌ణం. ఈ సోమ‌వారం నుండి శ్రావ‌ణం మొద‌లు కావ‌డంతో ర‌జ‌నీకాంత్ త‌న ఇంట్లో ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వేద‌మంత్రాల మ‌ధ్య శాస్త్రోత్తంగా పూజలు నిర్వ‌హించారు.

Related posts