telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆటగాళ్లకు వ్యాక్సిన్ పై బీసీసీఐ ఆలోచిస్తుంది…

మన దేశంలో కరోనా కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రోజురోజుకు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాల్గొనే ఆటగాళ్లను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఐపీయల్ ప్లేయ‌ర్లకు వ్యాక్సినేష‌న్ అంశంపై బీసీసీఐ ఆలోచ‌న చేస్తుందని, తర్వలో దీనికి సంబంధించి ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపనున్నట్టు ఆయన వెల్ల‌డించారు అలాగే కేవ‌లం ఆరు వేదిక‌ల్లోనే ఐపీఎల్ నిర్వ‌హిస్తున్నామ‌ని, ఆ దిశ‌గా బ‌యో బ‌బుల్ ఏర్పాటు చేశామ‌ని శుక్లా చెప్పారు. టీమ్స్‌లో స‌భ్యుల సంఖ్య‌ను కూడా పెంచిన‌ట్లు తెలిపారు. ప్రేక్ష‌కులు లేకుండానే టోర్నీ కొన‌సాగుతుంద‌ని బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు స్ప‌ష్టం చేశారు. ఐపీఎల్ 2021లో పాల్గొనబోతున్న ముగ్గురు ప్లేయర్స్ ఇప్పటికే వైరస్‌ బారిన పడటంతో.. ఆటగాళ్లకు వ్యాక్సినేషన్‌ ప్రస్థావనకు తెరపైకి తెచ్చింది. దాంతో ఆటగాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతామని.. దానికి వారు ఎలా స్పందిస్తారో చూసి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం అని తెలిపారు.

Related posts