telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రాజ్‌దూత్” ట్రైలర్ వచ్చేసింది

Rajdooth

రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి మేఘాంశ్ హీరోగా “రాజ్‌దూత్” అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తెర‌కెక్కిస్తున్నారు. రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘాంశ్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక క‌థానాయిక‌గా నక్షత్ర కనిపించనుంది. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మేఘాంశ్ కు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. సినిమాలో ఒక వ్యక్తి రాజ్ దూత్ బైక్ కోసం వెతుకుతుంటాడు. ఆ బైక్ ని తీసుకురావడానికి మేఘాంష్ బయలుదేరతాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కింది. ట్రైలర్ ని బట్టి సినిమా మొత్తం బైక్ చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. మరి తన మొదటి చిత్రంతో మేఘాంశ్ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సిందే. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts