telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

దుబాయ్ వేదికగా ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ హరుగుతున విషయం తెలిసిందే . అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ రాయల్స్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో తడబడింది. రాయల్స్ బౌలర్లకు వారికి వికెట్లు ఇవ్వలేదు కానీ ఎక్కువగా పరుగులు చేయలేకపోయింది. పవర్ ప్లే అయిన మొదటి 6 ఓవర్లలో జేవలం 26 పరుగులే చేసిన సన్‌రైజర్స్ 1 వికెట్ చేజార్చుకుంది. కానీ ఆ తర్వాత కెప్టెన్ వార్నర్, మనీష్ పాండే కొంచెం నెమ్మదిగా షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే వార్నర్ 48 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరగా మనీష్ (54) అర్ధసెంచరీ పూర్తి చేసుకొని వెనుదిరిగాడు. ఇక చివర్లో వచ్చిన కేన్ విలియమ్సన్ కొన్ని మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, జయదేవ్ ఉనాద్కాట్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే రాయల్స్ 159 పరుగులు చేయాలి. ఇక ఇంతకముందు చాలా సార్లు సన్‌రైజర్స్ 150 కంటే తక్కువ పరుగులు చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే 200 పైగా ఉన్న లక్ష్యాన్ని రాజస్థాన్ చేధించింది. మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది… ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.

Related posts