telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పోలింగ్ బూత్‌లో నన్నే అడ్డుకుంటావా .. మహిళా కానిస్టేబుల్‌పై మంత్రి ఫైర్

Rajasthan minister fire Lady constable

లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఓ మంత్రి మహిళా కానిస్టేబుల్‌పై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి భన్వర్‌లాల్ మేఘ్‌వాల్ చురు జిల్లా, సుజన్‌గఢ్‌లోని వార్డ్ నంబరు 20లో ఓటేసేందుకు వెళ్లారు. ఆయనతోపాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియాను అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ మనీషా ఖిచార్ అడ్డుకున్నారు.

మంత్రి ఓటు వేస్తుండగా ఫొటో తీసేందుకు వచ్చిన మీడియాను అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్‌పై మంత్రి రెచ్చిపోయారు. నన్నే అడ్డుకుంటావా? అంటూ పైపైకి వెళ్లారు. సహనం కోల్పోయి కానిస్టేబుల్‌ ను అనరాని మాటలన్నారు.ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఓటింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్‌ లోపలికి మీడియాను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. నేను రాజస్థాన్ మంత్రినని తెలియదా? అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి ఆగ్రహం చూసి కానిస్టేబుల్ హడలిపోయింది.

Related posts