telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టే: రాజస్థాన్ హైకోర్టు

Megistrate fire to BJP MLA

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టేననీ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతే తప్ప మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది. కొన్నేళ్లు ఒకమ్మాయితో సహజీవనం చేసి, తర్వాత మరో యువతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తి ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్ట వేసింది.

వివరాల్లోకి వెళితే ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న వివాహిత సహ ఉపాధ్యాయుడు బలరాంతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తోంది. బలరాం తనను పెళ్లి చేసుకుంటాడని భరోసా ఇవ్వడంతో భర్తను వదిలిపెట్టింది. ఆ తర్వాత బలరామ్‌కు ఐటీ విభాగంలో ఉద్యోగం రావడంతో అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.సహజీవనం చేయడమంటే పెళ్లాడినట్టేనని సంచలన కోర్ట్ తీర్పు వెలువరించింది.

Related posts