telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పౌరసత్వ చట్టంపై .. బహిరంగ సభ .. : రాజాసింగ్

rajasing mla bjp

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఉత్తర భారతదేశం అట్టుడుకుతుంది. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే మాత్రం అనుకూలంగా సభ నిర్వహిస్తానని ముందుకు రావడం చర్చకు దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టం సెగలు రేపుతుంటో రాజాసింగ్ తేనే తుట్టే కదిపే ప్రయత్నం చేశారు. ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో సభ నిర్వహస్తానని చెప్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు లేఖ కూడా రాశారు. రాజాసింగ్‌కు అనుమతి ఇవ్వడంపై సీపీ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసనలు ఢిల్లీ, యూపీ, బెంగాల్, కర్ణాటకకు చేరాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 17 మంది వరకు చనిపోయారు. ఆందోళనకారులు రాళ్లురువ్వుతూ.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారు. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది.

ఉత్తరభారతంలో హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే.. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా సభ నిర్వహిస్తానని రాజాసింగ్ ముందుకొచ్చి సంచలనం సృష్టించారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆదివారం మధ్యాహ్నాం 2 గంటల నుంచి 8 గంటల వరకు ఢిల్లీలో నిరనన చేపడుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించింది. యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ర్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు నిరసనలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Related posts