telugu navyamedia
news political Telangana

మోడీ వస్తే సంగతి చూస్తానన్న దోశద్రోహి  ఎక్కడ: రాజాసింగ్‌

rajasingh on public meeting
హైదరాబాద్‌కు మోడీ వస్తే సంగతి చూస్తానన్న దోశద్రోహి ఇప్పుడు ఎక్కడ అని గోషామహల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌  ప్రశ్నించారు.  సోమవారం రాత్రి ఎల్‌బి స్టేడియంలో జరిగిన ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ఉద్దేశించి ఆయన ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మీ సెక్యూరిటీని పక్కనబెట్టు, నా సెక్యూరిటీని పక్కనపెడతా. ఇదే ఎల్బీ స్టేడియంలో కబడ్డీ ఆడుదాం.. రా’ అని చాలెంజ్‌ చేశారు. 
మోదీ ఓసారి హైదరాబాద్‌ వచ్చి చూడాలని ఓ కుక్క సవాల్‌ చేసింది. ఎవరు సీఎం అయినా తన పాదాల వద్దకే రావాల్సి ఉంటుందని మరో కుక్క అంటోంది. మోదీ ఒక్కసారి కాదు.. ఎన్నిసార్లయినా వస్తారు.. వెళతారు.. నువ్వేమీ చేయలేవు’ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌కు ఒకసారి అవకాశం ఇవ్వండని రాజాసింగ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ పేరు భాగ్యనగరంగా మారుస్తామన్నారు. ఈ సభతో నగరంలోని బీజేపీ కార్యకర్తల్లో  ఉత్సాహం ఏర్పడింది.

Related posts

పాదాలపై ఆ భాగంలో పుట్టుమచ్చలు ఉంటే…..

ashok

జగన్ ప్రమాణస్వీకారానికి … పవన్ కళ్యాణ్ ..

vimala p

డిజిటల్ కెమెరా శకం ముగిసింది.. అంటున్న కానోన్ సీఈఓ ఫుజియా మిటరై

vimala p