telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తిని రేకెత్తిస్తున్న “కల్కి” టీజర్

Kalki

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న చిత్రం “కల్కి”. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సి.కళ్యాణ్ తో కలిసి రాజశేఖర్ నిర్మిస్తున్నారు. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఫస్టు టీజర్ ను విడుదల చేశారు. టీజర్ కు మంచి స్పందనే వచ్చింది. రాజశేఖర్ సరసన ఆదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈరోజు ఉదయం టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో రాజశేఖర్ లుక్, నేపథ్య సంగీతం బాగున్నాయి. సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మంగళవారం ఈ చిత్రం టీజర్ విడుదలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అందులో సినిమా విడుదల సమయానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లకు ఈ టీజర్ ను విడుదల చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. దశావతారాల్లో “కల్కి” 10వ అవతారం కావడంతో ఈ ముహూర్తాన్ని సెట్ చేయడం విశేషం.

ఈ చిత్రంలో రాజశేఖర్ తనకి బాగా అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరిగింది. ఇంతకుముందు అభిమానులు “‘యాంగ్రీ యంగ్ మేన్”గా పిలుచుకునే రాజశేఖర్ ఈ సినిమాతో “యాంగ్రీ స్టార్”గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Related posts