telugu navyamedia
సినిమా వార్తలు

రాజశేఖర్ “కల్కి” కాపీ కాదు… !

kalki movie first look

“యాంగ్రీ స్టార్” రాజశేఖర్ కథానాయకుడిగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇందులో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన హీరోయిన్ గా అదా శర్మ నటిస్తోంది. “కల్కి” చిత్రాన్ని జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఈ చిత్రాన్ని కాపీ వివాదం చుట్టుముట్టింది. కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత “కల్కి” కథ నాది అంటూ ముందుకు వచ్చాడు. దీనితో ఈ పంచాయతీ “కథా హక్కుల వేదిక” వద్దకు వెళ్ళింది.

తాజాగా కల్కి చిత్ర వివాదంపై “కథా హక్కుల వేదిక” కన్వీనర్ బివిఎస్ రవి స్పందించారు. తాము కథా హక్కుల వేదికని ఏర్పాటు చేసి రచయితల మధ్య , దర్శకుల మధ్య తలెత్తుతున్న వివాదాలని పరిష్కరిస్తున్నామని, ఒకవేళ కథల్లో పోలిక ఉన్నా, రెండు కథలు ఒకేలా ఉన్నా అసలైన రచయితకు క్రెడిట్ ఇవ్వడం లేదా నగదు చెల్లించమని నిర్మాతలకు చెప్పడం ద్వారా సమస్య పరిష్కరిస్తామని బివిఎస్ రవి అన్నారు. “కల్కి” చిత్రం గురించి మాట్లాడుతూ… తాము రచయిత కార్తికేయ కథని, “కల్కి” స్క్రిప్ట్ ని పరిశీలించామని, కానీ ఈ రెండు కథలో ఎలాంటి పోలికలు కనిపించలేదని, “కల్కి” చిత్రం కాపీ కాదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చారు.

Related posts