telugu navyamedia
telugu cinema news

“మా”లో అప్పుడే అసంతృప్తి జ్వాలలు… షాయాజీషిండే అసలు నటుడేనా ? కోటశ్రీనివాసరావు ఫైర్

Naresh Elected Maa President

ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగగా.. అందులో నరేష్ ప్యానల్ గెలిచింది. శుక్రవారం “మా” అధ్యక్షుడుగా నరేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. శివాజీరాజా కూడా ఈ వేడుకకు హాజరై నరేష్ ప్రమాణ స్వీకారంపై సానుకూలంగా స్పందించడం విశేషం. ఇక నరేష్ ప్రమాణ స్వీకారం అనంతరం పలుమార్లు “నా” అనే పదాన్ని వాడడం పట్ల “మా” వైస్ ప్రెసిడెంట్, హీరో రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో తాను మాట్లాడదల్చుకోలేదని, నరేష్ తనకు మంచి స్నేహితుడని, ఆయన పిలిస్తేనే ఇక్కడికి వచ్చానని, నరేష్ “నా” బదులు “మా” అని సంభోధిస్తే బాగుండేదని అంటూ మైక్ ను ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు.

rajasekhar

నటి, “మా” ఉపాధ్యక్షురాలు హేమ మాట్లాడుతుండగా అధ్యక్షుడు నరేష్ మైక్ లాగేసుకుని అందరి ముందూ ఆమెను అవమానించారు. అసలేం జరుగుతుందని మండిపడుతూ అందరికీ మాట్లాడే హక్కు ఉందని గుర్తు చేశారు. హేమ మాట్లాడుతూ ఆయన స్టేజ్ పై చెప్పిన మాటలు తమతో ముందుగా చర్చించలేదని, జనరల్ బాడీ మీటింగ్ లో కూర్చొని మాట్లాడి ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేసింది. అంతేకాదు నరేష్ ఇలా మైక్ లాక్కోవడం ఏం బాగా లేదంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

HEMA

ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ నటుడు కోటశ్రీనివాస రావు మాట్లాడుతూ తెలుగులో తెలుగు నటులకు అవకాశాలు ఇవ్వకుండా, పరభాషా నటులకు నటన రాకపోయినా, వాళ్ళను విమానాల్లో తీసుకొచ్చి, వారిని ఏసీ రూముల్లో ఉంచుతున్నారని, లక్షల పారితోషికం ఇస్తున్నారని, కృష్ణానగర్ లో పడిగాపులుగాసే మన తెలుగు నటులకు నెలలో కనీసం 12 రోజులు పని ఇచ్చినా వాళ్లకు తినడానికి తిండి దొరుకుతుందని, పరభాషా నటీనటులు ఇక్కడే ఇళ్ళు కట్టుకుంటుంటే… మన నటీనటులు మాత్రం పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని, పరభాషా నటులను అందలం ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Kota-Srinivasa-Rao

షాయాజీషిండే అసలు తెలుగులో ఎలాంటి నటుడు ? వాళ్ళ భాషలో ఆయన గొప్ప నటుడే కావచ్చు… కానీ తెలుగులో ఆయన నటన ఏంటి ? అమితాబ్ బచ్చన్, నానాపాటేకర్ లాంటి దమ్మున్న నటులను తీసుకురండి వాళ్ళ దగ్గర నేను నౌకరు వేషం వేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. “మా”కు ఎంతమంది కొత్త అధ్యక్షులు వచ్చినా తెలుగు నటీనటుల భవిష్యత్తును మార్చలేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ విషయంపై కోట శ్రీనివాస రావు గారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts

`రంగ‌స్థ‌లం `ఫేమ్ మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న `నేను నా నాగార్జున` సినిమా ఫ‌స్ట్ లుక్‌

ashok

హైదరాబాద్ : …. జర్మన్ బాలల చిత్రోత్సవానికి … సినీ ఔత్సాహికుల విశేష స్పందన …

vimala p

బాలీవుడ్ లో “ప్రస్థానం”… కలెక్షన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే…!!

vimala p