telugu navyamedia
telugu cinema news trending

ఎన్టీఆర్ బయోపిక్ : “రాజర్షి” పాట వచ్చేసింది

NTR-biopic

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు. దీంతో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి ఆసక్తికరమైన పోస్టర్లు, పాటలు విడుదల చేస్తున్నారు. ఇటీవల “కథానాయకుడు” నుంచి విడుదల చేసిన మొదటి పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా “రాజర్షి” అనే రెండవ పాటను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది.

ముందుగా డిసెంబర్ 10న ఈ పాటను విడుదల చేయాలనీ నిర్ణయించుకున్న దర్శకనిర్మాతలు “రాజర్షి” పాట విడుదలను వాయిదా వేశారు. ఈనెల 12న ఉదయం 10 గంటల 31 నిమిషాలకు “రాజర్షి” పాటను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దాదాపు 10 మందికిపైగా హీరోయిన్లు, టాప్ హీరోలు ఈ సినిమాలో నటిస్తుండడంతో సినిమాపై అందరికీ భారీ ఆసక్తి నెలకొంది. సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Related posts

కథానాయకుడు : ప్రీమియర్ షో టాక్… కౌంటర్ పడినట్లేనా…

vimala p

జెన్నిఫర్ లోపేజ్ తో అలేక్స్ రోద్రిగే .. నిర్చితార్థం .. !

vimala p

మరింత తీవ్రంగా.. ఫెథాయ్ తుఫాన్… వణికిస్తున్న…

vimala p