రాజకీయ వార్తలు

బాబాల ఆశీస్సుల కోసం హిమాలయాలకు రజనీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు హిమాలయాలకు వెడుతున్నారు .
రజనీకాంత్ కు హిమాలయాలకు వెళ్లడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సార్లు వెళ్లి నెలల తరబడి వుండే వాడు. అక్కడ నివసించి, పరమ పదించిన మహావతార్ బాబాజీ అంటే రజనికి ఎంతో గురి. బాబా నివసించిన ప్రాంతంలోనే గత సంవత్సరం ఒక యోగాశ్రమం కట్టించాడు. రజని అక్కడే ఉండి మౌన దీక్షలో ఉంటాడని ఆయన ప్రచార కార్యదర్శి రియాజ్ అహ్మద్ చెప్పాడు. 67 సంవత్సరాల రజనీకాంత్ రాజకీయ పార్టీని త్వరలోనే ప్రకటిస్తారని అనుకుంటున్నసమయంలో హఠాత్తుగా హిమాలయాలకు వెడుతున్నట్టు ప్రకటించాడు. ఈరోజు చెన్నై నుంచి విమానంలో సిమ్లా వెడతారు. అక్కడ నుంచి కారులో ధర్మశాల, రుషికేశ్ వెడతారని రియాజ్ తెలిపాడు. రజని అక్కడ బాబాజీ సమాధిని సందర్శిస్తాడని ఆయన చెప్పాడు. ఆ తరువాత రజనీకాంత్ హిమాలయాల్లో స్వామిలు, బాబాలను కలసి వారి దీవెనలు తీసుకుంటారు.

పార్టీ ప్రకటనకు ముందు బాబాల ఆశీర్వచనాలు అవసరమని రజని భావించాడు. అందుకే రజనీకాంత్ హిమాలయాలకు వెడుతున్నారు. రజనీకాంత్ హిమాలయాల నుంచి వచ్చిన తరువాత పార్టీని ప్రకటించే అవకావం వుంది.

Related posts

మళ్ళీ రాజ్యాధికారం మాదే : కవిత

admin

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి యువకుడి హల్‌చల్.. ఎంపీ కవిత ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ బెదిరించే యత్నం!

madhu

ఒంగోలు నాగార్జున పీజీ సెంటర్.. ఇక యూనివర్సిటీ…

chandra sekkhar

Leave a Comment