telugu navyamedia
telugu cinema news

“కేజిఎఫ్” ప్రీ రిలీజ్ ఈవెంట్… ముఖ్య అతిథిగా రాజమౌళి

Rajamouli-and-YAsh

కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా 1970నాటి కథా నేపథ్యంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “కేజిఎఫ్”. ఈ సినిమాతో గోల్డ్ మైన్స్ లో పనిచేసే కార్మికుల జీవితాల్లోని కన్నీటికి తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నెల 21న కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రానికి భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు భారీ స్పందన లభించింది.

ఇక ఈనెల 9న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ వేడుకకు ముఖ్య అథితిగా రాజమౌళి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం టీజర్ తో ఇప్పటికే తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ కు ఇది కలిసొచ్చే అంశమని చెప్పుకుంటున్నారు సినీవిశ్లేషకులు.

Related posts

కత్రినాతో స్టార్ హీరో లిప్ లాక్… అదృష్టం అతనిదే

vimala p

“భైరవగీత” మా వ్యూ

vimala p

“ఆర్ఎక్స్ 100” దర్శకుడికి పితృవియోగం

vimala p