telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్… ?

ram

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో రాజమౌళి ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ‘ఆర్ ఆర్ ఆర్’ ఇంకా సెట్స్‌పై ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్‌తో సెట్ చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా కొరటాల శివతో పాటు గౌతమ్ తిన్ననూరి.. కొత్త దర్శకుడు ప్రదీప్ చెప్పిన కథలను విన్నాడు. అందుకే రాజమౌళి కూడా తన తర్వాతి సినిమా కోసం హీరోను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’  చేస్తున్నపుడే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాయడం మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఈ సారి ఎవరూ ఊహించని హీరోతో రాజమౌళి సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అతనెవరో కాదు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంచలనం సృష్టించిన హీరో రామ్. అన్నీ కుదిర్తే ఈయనతోనే రాజమౌళి తర్వాతి సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రానుందని ప్రచారం జరుగుతుంది.

Related posts