telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’ పై వెనక్కి తగ్గని రాజమౌళి

‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. రాజ‌మౌళి ఉగాది సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేశాడు. ‘రౌద్రం, రణం, రుధిరం’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకి ఎట్టకేలకు ‘రౌద్రం రణం రుధిరం’ పేరు ఖరారు చేశారు. సినిమాను 2021 జనవరి 8న విడుదల చేయనున్నారు. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై మాత్రం రాజమౌళి ఏమాత్రం వెనక్కి తగ్గనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అంతా సినిమా షూటింగ్స్ బంద్ చేశారు. తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సంవత్సరం జులై 30న ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ కావాల్సి ఉన్నా వచ్చే ఏడాది 2021 జనవరిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆ సూచనలు కనపడటం లేదు అని ప్రేక్షకులంతా భావిస్తున్నారు.’ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ముగిద్దాం అనుకుంటున్న టైంలో కరోనా వైరస్ ప్రబలడంతో సినిమా షూటింగ్ నిలిపేశారు. కానీ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా ప్లాన్ చేస్తుందట కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ సినిమా విడుదల వాయిదా పడుతుంది అనుకున్నారంతా.. కానీ మోషన్ పోస్టర్ లో మాత్రం యధావిధిగానే 2021జనవరి 8న విడుదల చేయనున్నట్లు స్పష్టంగా తెలిపారు రాజమౌళి.

Related posts