telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ కార్మికులకు జక్కన్న విరాళం

Rajamouli

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమవంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి పేద సినీ కార్మికులకు అండగా నిలిచారు. దీంతో సినీ తారలంతా కార్మికులకు అండగా నిలిచారు. మెగాస్టార్ నుంచి సూపర్ స్టార్ వరకు తారలంతా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా జక్కన్న కూడా నేను సైతం అంటూ సినీ కార్మికులకు సాయం ప్రకటించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేని సినీ కార్మికులకి తన వంతు సాయం చేసేందుకు రాజమౌళి తన వంతు సాయం చేశారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఆర్థిక సాయం అందించాడు. సినిమా కార్మికుల కోసం ఏర్పాటు చేసిన CCCకి 10 లక్షల విరాళం ప్రకటించాడు. రాజమౌళి ఇప్పటికే భారీగా మాస్కులతో పాటు ప్రొటెక్టర్స్ అందించారు. ఇప్పుడు ప్రకటించిన విరాళాన్ని కూడా త్వరలోనే ఈ మొత్తాన్ని ఛారిటీకి అందించనున్నారు.

Related posts