• Home
  • వార్తలు
  • భర్త ఒత్తిడితో వెనుకడుగు..తిరిగి కాంగ్రెస్‌ గూటికి పద్మినీరెడ్డి!
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

భర్త ఒత్తిడితో వెనుకడుగు..తిరిగి కాంగ్రెస్‌ గూటికి పద్మినీరెడ్డి!

Raja narasimha, Padmini BJP to Congress

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి గురువారం అనూహ్యంగా బీజేపీలో చేరారు. లక్ష్మణ్‌, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చు కున్నారు. రాత్రికల్లా తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

గురువారం రాత్రి సంగారెడ్డిలోని తమ నివాసంలోఆమె మీడియాతో మాట్లాడారు.ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. ‘కార్యకర్తల మనోవేదనను దృష్టిలో పెట్టుకుని నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. ఇంత రియాక్షన్‌ ఉంటుందని నేను అనుకోలేదు. బీజేపీలో చేరడం అనుకోకుండా జరిగింది. కార్యకర్తల బాధను చూడలేకపోతున్నా’అని పద్మిని వ్యాఖ్యానించారు. తన భర్త దామోదర రాజనర్సింహ, కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకొని తిరిగి కాంగ్రెస్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అటు, పద్మిని పార్టీ మార్పుతో కలవరం చెందిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు  కథ సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

బార్ షాపుల్లో ఎక్స్‌పైర్‌ బ్రీజర్‌లు..మద్యం ప్రియులు జర జాగ్రత్త!

madhu

అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు సైతం తప్పని లైంగిక వేధింపులు… కేసు నమోదు

nagaraj chanti

ఏపీ అభివృద్ధికి దిగ్గజ పారిశ్రామిక వేత్త… లేఖ…

chandra sekkhar

Leave a Comment