telugu navyamedia
సినిమా వార్తలు

శిల్పాశెట్టి డ్రెస్ పై భర్త సెటైర్…

Shilpa-Shetty

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్‌ తో ఎంతో స్టయిలిష్‌గా ఉండడంతో ఫ్యాషనబుల్ యాక్ట్రస్‌గా పేరు సంపాదించింది. తాజాగా ఆమె ధరించిన ఒక అవుట్‌ఫిట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఆమె భర్త రాజ్‌కుంద్రా మాత్రం శిల్పా ధరించిన డ్రెస్‌పై విచిత్రమైన కామెంట్ చేశారు. ఇటీవల శిల్పా ఒక వైట్‌కలర్ అవుట్‌ఫిట్ ధరించింది. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకోగా, ఆమె భర్త మాత్రం ఫన్నీగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో “నువ్వు ఇంటికి వచ్చినపుడు నా కర్టెన్ తీసుకువచ్చి, దానిని యథాస్థానంలో తగిలించు” అంటూ కామెంట్ చేశారు. ఇది చూసిన శిల్ప సమాధానమిస్తూ “దీనితో పాటు మిమ్మల్ని కూడా తగిలించేస్తాను” అంటూ ట్వీట్ చేసింది. భార్యాభర్తల మధ్య సాగిన ఈ సరదా సంభాషణ వైరల్ గా మారింది.

Related posts