వార్తలు సామాజిక సినిమా వార్తలు

రైతు నానీలు…

రైతు పండించిన
మిర్చి పంట..
ధర లేక మిగిల్చింది
కడుపు మంట..!                    
       
ఏ పంట వేయాలో
సర్కారు చెప్తది..
పండిస్తే ధరలు..
దళారీలు చెప్తరు..!                       
      
కనీస మద్ధతు ధర
నేతి బీరలో నెయ్యి!
రైతు బతుక్కి
తీస్తారు గొయ్యి..!                    
     
గిట్టుబాటు ధరలు
దేవతా వస్త్రాలే..
ఎంత వెతికినా
కనిపించవు…!                        
     
రైతు రాజయ్యే మాట
దేవుడెరుగు..
కడుపు మండితే
ప్రళయ రుద్రుడే…!
       
         -వెన్నెలసత్యం
           షాద్ నగర్

Related posts

మన్ కి బాత్ రచయిత… ?

admin

రేవంత్ రెడ్డి చీకటి బాస్ చంద్రబాబు: ఎంపీ బాల్క సుమన్

madhu

“అదుగో” ట్రైలర్ వచ్చేసింది… బంటీ ఇన్ ఏ స్టోరీ విత్ 440 వోల్ట్స్ ఎమోషన్…

vimala t

Leave a Comment