telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతు భరోసా .. మార్గదర్శకాలు ఇవే..

raitu bharosa scheme rules

ఏపీలో అక్టోబర్ 15వ తేదీ నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కాబోతుంది. రైతులకు, కౌలు రైతులకు రూ. 12 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సెప్టెంబర్ 19వ తేదీ గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. సాగు చేసే భూమితో సంబంధం లేకుండా రైతులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు వర్తిస్తుంది. కేంద్రం అందించే ప్రధాని కిసాన్ యోజన కింద ఇచ్చే 6వేల రూపాయలు కూడా ఈ సాయంలో కలిసే ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు చెప్పింది.

* కౌలు రైతులకు రైతు భరోసా కల్పించేలా మార్గదర్శకాలు
* ఉద్యాన పంటలు కనీసం ఎకరం భూమి సాగులో ఉండాలని నిబంధన
* కూరగాయలు, పశువుల మేత కోసం అర ఎకరం భూమి సాగు చేస్తుండాలి

వీరికి వర్తించదు : –
* ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు రైతు భరోసా స్కీమ్ వర్తించదు. మేయర్లు, జడ్పీ ఛైర్మన్లకు ఇతర ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు.
* జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు వర్తించదు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఆదాయపన్ను కట్టే రైతులకు ఈ పథకం వర్తించదు.
* వృత్తిపరమైన సంస్థల కింద రిజిస్టర్ అయి..తమ వృత్తులను కొనసాగిస్తూ గత ఏడాది కాలానికి ఆదాయ పన్ను చెల్లించిన డాక్టర్లు.
* నెలకు రూ. 10 వేలు లేదా అంతకుమించి పెన్షన్ పొందుతున్న వారు అనర్హులు.
* ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి అనుబంధ కార్యాలయాలు, ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్వతంత్ర సంస్థల ఉద్యోగులు, స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు.
* అత్యధిక ఆర్థిక హోదా ఉన్న వర్గాలు అనర్హులు.
* సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పరమైన పదవులు నిర్వహించిన, ప్రస్తుతం నిర్వహిస్తున్న వారి కుటుంబాలు అనర్హులు.

ఇవీ అర్హతలు : –
* భూ సేకరణ పథకం కింద సేకరించి, నష్టపరిహారం చెల్లించని వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్న వారు.
* ఉమ్మడి ఆస్తి వ్యవహారంలోనైతే ఆ కుటుంబంలో ఎవరి పేరిట ఎక్కువ భూమి ఉంటుందో వారి బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ.
* ఆర్ఓఎఫ్ఆర్ భూములు, డి పట్టా భూములను సాగు చేసుకుంటున్న కుటుంబాలు.
* కుటుంబంలో ఇద్దరు లేదా..అంతకు మించిన వారికి సమానంగా సాగు భూమి ఉన్నట్టయితే..వారిలో పెద్దవారి ఖాతాకు నగదు బదిలీ.

ఈ పథకానికి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.

Related posts