telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అక్టోబర్‌ 15 నుంచి ‘రైతు భరోసా’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు రైతన్నకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అక్టోబర్‌ 15 నుంచి ‘రైతు భరోసా’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.12,500 ఇస్తామని ముఖ్యంత్రి పేర్కొన్నారు. గురువారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నకిలీ విత్తనాల వ్యవహారం, రైతు రుణాలు, మద్దతు ధరలపై నిశితంగా చర్చించారు.

ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ప్రకారం రైతు కుటుంబానికి గరిష్టంగా రూ. 10వేలు ఇస్తానని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఎన్ని ఎకరాలున్నా రూ. 10వేలు సాయం చేస్తానని చెప్పారు. ‘రైతు భరోసా’ పథకం తో అక్టోబర్ నుంచి రైతులకు రూ.12,500 సాయం అందే అవకాశముంది.

Related posts