telugu navyamedia
telugu cinema news trending

క్రికెటర్ పై సూర్య కామెంట్స్… నమ్మలేకపోతున్నా… అనుకోని అతిథి…

surya ngk movie teaser

ప్రముఖ తమిళ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈ నెల 31న సూర్య నటించిన “ఎన్‌.జి.కె” విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న సూర్య ట్విట్ట‌ర్ అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. ఈ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో సూర్య‌కు అనుకోని అతిథి నుండి ఓ ప్ర‌శ్న ఎదురైంది. ఆ అతిథి ఇండియ‌న్ క్రికెట‌ర్ సురేష్ రైనా. “మీకు చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో ఏ క్రికెట‌ర్ అంటే ఇష్టం?” అని సూర్య‌ను రైనా ప్రశ్నించగా… “మీకు నాతో మాట్లాడ‌టానికి స‌మ‌యం దొరికిందా? నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. మీ పాప గ్రేసియాతో పాటు అంద‌రినీ అడిగాన‌ని చెప్పండి. నాకు చెన్నై సూప‌ర్‌కింగ్స్‌లో ధోని అంటే చాలా ఇష్టం. నేను కావాల‌నే చెప్ప‌లేదు. నేను ఎప్ప‌టికీ సూర్‌కింగ్స్ అభిమానినే. సూప‌ర్‌కింగ్స్‌లో నేను క‌లిసిన తొలి ఆట‌గాడు ధోని. ఆ స‌మ‌యంలో మీరు నాకు హ‌లో చెప్ప‌డం ముచ్చ‌టేసింది. మ‌న ఇద్ద‌రం క‌లిసి దిగిన ఫోట‌ను నేను ఎప్ప‌టికీ భ‌ద్రంగా దాచుకుంటాను” అంటూ సమాధానం ఇచ్చారు హీరో సూర్య‌.

Related posts

హిందుస్తాన్ పెట్రోలియంలో .. ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం ..

vimala p

మళ్ళీ టీడీపీ రాజ్యమే .. చంద్రబాబు ధీమా..

vimala p

‘కొండ’లు మళ్ళీ .. కదులుతున్నాయి.. ఈ సారి బీజేపీకే గుడి..

vimala p