railways ready to give discounts in fares of tickets

రైల్వే కూడా డిస్కౌంట్స్ ఇస్తాం అంటుంది… ఇక టికెట్స్ ధరలు తగ్గనున్నాయి..

సాధారణంగా మార్కెట్ లలో ఎక్కడ చూసినా డిస్కౌంట్ ల హడావుడి ఉంటుంది… ఇక అక్కడ వినియోగదారుల తాకిడి కూడా అలాగే ఉంటుంది. ఇన్నాళ్ళకి ఈ వ్యాపార రహస్యం అర్ధం అయిందేమో రైల్వే వారికి మొత్తానికి వాళ్ళు కూడా ఆ పదాన్ని వాడేసుకుందాం అనుకుంటున్నారు.. అదే నండి డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఎక్కడైతే ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉందొ అక్కడక్కడ డిస్కౌంట్ ఆఫర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్రాధమికంగా ఎంపిక చేసిన రైల్వే మార్గాలలో ఈ విధానాన్ని అమలు చేయదలిచారు.

గతంలో ఫ్లెక్సీ ఫెర్ పేరుతో అమాంతంగా పెరిగిన ధరలు ఇప్పుడు ఆ విధానాన్ని తొలగిస్తున్నందున మరియు డిస్కౌంట్ కూడా ఇస్తున్నందున టికెట్ ధరలు మరింత చౌకగా అయ్యే అవకాశం ఉంది. పెరిగిన ధరలలో చాలా చోట్ల అక్యూపెన్సీ కూడా తగ్గిపోతుండటంతో రైల్వేశాఖ ఈ నిర్ణయానికి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *