telugu navyamedia
వార్తలు సామాజిక

నెల రోజులకు పెరిగిన రైల్వే అడ్వాన్స్ బుకింగ్

Train Indian railway

రాజధాని రూట్లలో నడిచే 30 ఏసీ రైళ్లకు సంబంధించి టికెట్ల బుకింగులో కొన్ని మార్పులు చేసింది. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్లు ఇప్పటి వరకు ఏడు రోజులకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పెంచింది. రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ ఈ టికెట్లను బుక్‌చేసుకోవచ్చు. ఇంతకుముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే వీటిని బుక్‌ చేసుకునేందుకు వీలుండేది.

ఇకపై పీఆర్‌ఎస్‌ కౌంటర్లు, పోస్టాఫీసులు, యాత్రి టికెట్‌ సువిధ కేంద్రాలు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్లు, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల వద్ద కూడా ఈ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువును వారం నుంచి 30 రోజులకు పెంచినట్లు రైల్వే శాఖ శుక్రవారం తెలిపింది. అయితే ఈ రైళ్లకు తత్కాల్‌ బుకింగ్స్‌ ఉండవని స్పష్టంచేసింది.

Related posts