telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు

ఆన్ లైన్ శానిటరీ ప్యాడ్లు .. ప్రయాణికులపై .. రైల్వే శ్రద్ద..

Attack Railway TTI in Danapur express

రైల్వే ఇటీవల ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఎటువంటి సమస్య తలెత్తినా కూడా క్షణాలలో దానికి పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ, మరోసారి తన ఉదారతను చాటుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న వేళ, నెలసరి సమస్యతో బాధపడుతున్న యువతికి టాబ్లెట్లు, శానిటరీ ప్యాడ్లు అందించింది.

వివరాలలోకి వెళితే, బెంగళూరు నుంచి బళ్లారికి వెళుతున్న ఓ యువతికి, రైల్లో నెలసరి సమస్య ఏర్పడగా, ఆమె మిత్రుడు రాత్రి 11 గంటల సమయంలో ‘ఇండియన్ రైల్వేస్ సేవ’ యాప్ ద్వారా రైల్వే మంత్రికి ట్వీట్ చేశాడు. ఆపై ఆరు నిమిషాల్లోనే అధికారులు, ఆమె ప్రయాణిస్తున్న బోగీ వద్దకు వచ్చారు. వివరాలు ధ్రువీకరించుకుని, తదుపరి వచ్చే అరసికేరు రైల్వే స్టేషన్ అధికారులకు విషయం చెప్పారు. ఆ వెంటనే వారు ఆమెకు కావాల్సిన శానిటరీ నాప్కిన్స్, టాబ్లెట్లను సిద్ధం చేసి, రైలు రాగానే అందించారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు అధికారులను అభినందించారు.

Related posts