telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైల్వే అధికారుల .. క్రమబద్దీకరణ ..

railway minister piyush goyal on officers transfer

కేంద్ర రైల్వే బోర్డులో 200 మంది దాకా డైరెక్టర్లు, ఆపై స్థాయి అధికారులు ఉన్నారు. వీరిలో 50 మందిని తొలగించి జోన్లకు పంపించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. సిబ్బందిని క్రమబద్దీకరించి వారిని అధికారుల కొరత ఉన్న జోన్లకు పంపించాలని బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌కు మంత్రి అంతర్గత ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు.

వాజ్‌పేయి హయాంలోనే ఇలాంటి చర్యలకు కమిటీ వేసి నివేదిక సిద్ధం చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం, అలసత్వం, రాజకీయ సంకల్పం లేక అమలుకు నోచుకోలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్యతో జోన్ల పరిధిలో మెరుగైన సేవలకు అందిచడంతోపాటు, వనరుల సమర్ధ వినియోగం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్యూన్ల సంఖ్యను కూడా కుదించాలని భావిస్తున్నట్టు సమాచారం.

Related posts