telugu navyamedia
రాజకీయ వార్తలు

నా నిర్ణయం మార్చుకోను ..తేల్చిచెప్పిన రాహుల్ గాంధీ

rahul gandhi to ap on 31st

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా మీరే కొనసాగాలంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం చేసిన అభ్యర్థనను రాహుల్ తిరస్కరించారు. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్‌ను కలిసి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడిగా మీరే కొనసాగాలని కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ రాహుల్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తన నిర్ణయాన్ని మార్చుకోబోనని స్పష్టం చేశారు. ఓటమికి ఏ ఒక్కరో బాధ్యత వహించాల్సిన అవసరం లేదని రాహుల్ పేర్కొన్నారు. దాదాపు అన్ని చోట్లా ఓటమి పాలయ్యామని గుర్తు చేశారు. చాలాచోట్ల మంచి ఫలితాలు వస్తాయని భావించామని అయితే, అక్కడ కూడా విఫలమయ్యామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts