telugu navyamedia
రాజకీయ వార్తలు

విపక్ష నేతల సమావేశానికి రాహుల్‌ గైర్హాజర్

rahul gandhi to ap on 31st

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి గెలుస్తుందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిల్లీలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈ ఫైలితాలతో విపక్షపార్టీల మధ్య దూరం పెరిగిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తించిన తీరు, 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపుపై చర్చించేందుకు మంగళవారం స్థానిక కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాహుల్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, యూపీ ఆగ్రనాయకులు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి‌ ఎన్సీపీ అధ్యక్షుడు శరదపవార్‌లు సమావేశానికి హాజరు కాలేదు.

Related posts