telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందిస్తాం: రాహుల్

Rahul support to Govt. terrarists attack

జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని విభజించాలని ఉగ్రవాదులు భావిస్తున్నారని, అది ఎవరికీ సాధ్యం కాదన్నారు. అందుకే వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులు ఎంతగా ప్రయత్నించినా ఒక్క సెకను పాటు కూడా హిందుస్థాన్‌ ప్రజలను వేరుచేయలేరన్నారు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఒకేతాటిపై నిలవాలని, అపుడే మన ఐక్యత గురించి వారి తెలుస్తుందని పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగిందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయని రాహుల్ వ్యాఖ్యానించారు.

Related posts