telugu navyamedia
telugu cinema news trending

బిగ్ బాస్-3 : వితికా, పునర్నవి గొడవ… పునర్నవికి వరుణ్ సపోర్ట్

Bigg-Boss

బిగ్ బాస్ సీజ‌న్-3 ఎపిసోడ్ 10లో ఇక వితికా-పున‌ర్న‌వి మ‌ధ్య చిన్న వివాదం చెల‌రేగ‌గా, ఈ గొడ‌వ‌లో పున‌ర్న‌వికి వ‌రుణ్ సందేశ్ స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంట్లో నీళ్ళు, గ్యాస్ అయిపోవ‌డంతో వాటి కోసం ఇంటి స‌భ్యులు ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డ్డారు. మొత్తానికి ఈ వారం ఎలిమినేష‌న్ నుండి త‌ప్పించుక‌నేందుకు శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు పక్కా ప్లానింగ్‌తో త‌మ గేమ్ ఆడుతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌తి మ‌నిషి జీవితంలో నీరు చాలా అవ‌స‌రం. వాటిని వృధా చేస్తే రానున్న రోజుల‌లో చాలా క‌ష్టాన్ని చ‌వి చూడాల్సి వ‌స్తుంది. ఇది బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి కూడా తెలియ‌జేసే ఉద్ధేశంతో బిగ్ బాస్ వారికి ఓ టాస్క్ ఇచ్చారు. గ్యాస్, కరెంట్‌, వాట‌ర్‌ని ఆఫ్ చేసి వాటిని తిరిగి పొందేందుకు గార్డెన్ ఏరియాలోని గ్యాస్‌, వాట‌ర్‌, ఇంటి స‌రుకుల బోర్డుల‌తో ఉన్న మూడు సైకిల్స్‌ ని ఆగ‌కుండా తొక్కాల‌ని సూచించారు బిగ్ బాస్. ఈ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ కోసం సైకిల్‌ని మేం తొక్కుతామంటే మేం తొక్కుతామ‌ని పోటీ ప‌డ్డారు. ముందుగా శ్రీముఖితో పాటు బాబా భాస్కర్, ర‌వికృష్ణ‌ సైకిల్ తొక్క‌డం మొద‌లు పెట్టారు. టీంలుగా విడిపోయి అంద‌రు సైకిల్ తొక్కితే బాగుంటుంద‌ని శివ‌జ్యోతి కాసేపు రచ్చ చేసింది. ఇంత‌లో త‌మ‌న్నా నేను ఇప్పుడు తొక్కి నైట్ ప‌డుకుంటాన‌ని అంది. ఇక్క‌డ అలాంటివి కుద‌ర‌వ‌ని శివ‌జ్యోతి చెప్పుకొచ్చింది.

టాస్క్ జ‌రుగుతున్న స‌మ‌యంలో లివింగ్ ఏరియాలో కూర్చున్న పున‌ర్న‌వి.. వితికా మంచి గురించి ఆలోచించి నువ్వు కిచెన్‌కే ప‌రిమిత‌మైతే టాస్క్‌లో ఎప్పుడు పాల్గొంటావు అని చెప్పింది. దీనికి వితికా నేను అంద‌రికి దోసెలు వేస్తున్నాను. ఖాళీగా ఏమి లేను క‌దా అని అంది. వితికా నువ్వు పునర్న‌విని త‌ప్పుగా అనుకుంటున్నావు అని వ‌రుణ్ సందేశ్ పున‌ర్న‌వికి స‌పోర్ట్ చేయ‌డంతో గుక్క‌పెట్టి ఏడ్చింది వితికా. ఎప్ప‌టిలాగ‌నే ఆమె వ‌ద్ద‌కి వెళ్లిన మిగ‌తా ఇంటి స‌భ్యులు ఆమెని ఓదార్చారు. ఇంత‌లో జాఫ‌ర్ ఎమోష‌న‌ల్ అయిన వారిని కాసేపు వ‌దిలేస్తేనే మంచిద‌ని అన్నారు. ప‌క్కనే ఉన్న ర‌వికృష్ణ మ‌నం ఎవ‌రం వెళ్ల‌క‌పోతే వాళ్లు మ‌రోలా అనుకుంటారు. హ్యాపీగా ఉన్న టైంలో అంద‌రు వ‌స్తారు, కాని బాధ‌ని షేర్ చేసుకోవ‌డానికి ఎవ‌రు రారు అని బాధ‌ప‌డ‌తారు అని చెప్పుకొచ్చారు

వ‌రుణ్‌, వితికా, పున‌ర్న‌వి గొడ‌వ‌కి సంబంధించి కొంత నాట‌కీయ‌త చోటు చేసుకోగా ఆ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్‌, వితికాలు ఒక‌రికొక‌రు క్ష‌మాప‌ణ‌లు చెప్పుకోవ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ కోసం సైకిల్ ఆగ‌కుండా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు తొక్కుతూనే ఉన్నారు. ఇంత‌లో మ‌హేష్‌, బాబా భాస్క‌ర్, త‌మ‌న్నా, జాఫ‌ర్ లు శ్రీముఖి గురించి చ‌ర్చించ‌సాగారు. శ్రీముఖిని మొద‌ట చూసి ఎమో అనుకున్నాం కాని ఆమె అనుకున్నంత ప‌ర్‌ఫెక్ట్‌గా గేమ్ ఆడ‌డంలేదని వారు చ‌ర్చించారు. నేటి ఎపిసోడ్‌లో శివ‌జ్యోతి – వ‌రుణ్ సందేశ్ మ‌ధ్య చిన్న‌పాటి ర‌చ్చ జ‌రిగిన‌ట్టు ప్రోమోలో చూపించారు. తప్పు త‌న‌దే అని వ‌రుణ్ ఒప్పుకోవ‌డంతో శివ‌జ్యోతి క‌న్నీటి కుళాయి తిప్పింది. ఇక రాహుల్ సింప్లిగంజ్ కు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చలు సాగ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

Related posts

ఫెమినిస్ట్ అన్న నెటిజన్ కు సమంత కౌంటర్

vimala p

సూర్యతో కాజల్ లిప్ లాక్ నిజం కాదట…!!

vimala p

అలిగిన పద్మారావు .. డిప్యూటీ స్పీకర్ ఇస్తానంటున్న కేసీఆర్..

vimala p