telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పునర్నవితో సినిమాకు రాహుల్ గ్రీన్ సిగ్నల్…!

Rahul-and-Punarnavi

‘బిగ్‌బాస్ తెలుగు 3’‌లో టైటిల్ విన్నర్‌గా నిలిచిన రాహుల్, మరో కంటెస్టెంట్ పునర్నవి ప్రేమించుకుంటున్నారని, బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాల్లో వార్తలు తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అంతేందుకు ఈ జంట పెళ్లి చేసుకుంటే ఆనందపడే అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. అయితే రాహుల్ టైటిల్ విన్నర్‌గా నిలిచి, బయటకు వచ్చాక తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, అంతేకాని లవర్స్ కాదంటూ రాహుల్ చాలా సార్లు స్పష్టం చేశాడు. ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చే స్నేహితులమని అంతే కాని మా మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చాడు. అది అలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పునర్నవితో సినిమా అవకాశం వస్తే హీరోగా నటిస్తావా? అంటూ అడిగిన ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పాడు. పునర్నవితో సినిమా అవకాశం వస్తే 110 పర్సెంట్ సినిమా చేస్తానని తన ఇష్టాన్ని తెలిపాడు. ఈ జంటకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ నిర్మాత ముందుకొస్తాడో చూడాలి మరి.

Related posts