telugu navyamedia
news political

రాహుల్ కు బీజేపీ పెళ్లి చేస్తుందా?

rahul modi

దేశవ్యాప్తంగా నిర్వహించిన మొన్నటి  లోక్ సభ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో  కేంద్రంలో వరుసగా రెండోసారి బీజేపీ నేతృత్వంలోని  ఎన్డీయే సర్కార్‌ కొలువు తీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం విధితమే. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోవడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాకు సిద్దమైన సంగతి తెలిసిందే. 
Rahul was in active politics
గత ఎన్నికల్లో రాహుల్, సోనియా ప్రచారంలో పాల్గొనేవారు. ఈ సారి ఎన్నికల్లో  ప్రియాంకా గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. మరో నాలుగేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ విరామం తీసుకునే పరిస్థితులు నెలకొన్న క్రమంలో పలువురు సీనియర్ ఎంపీలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి  వెళ్ళేందుకు సిద్దమవుతునట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకీ పూర్వ వైభవం తీసుకు రావాలంటే రాహుల్ ఏమి చేయాలనే  చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతుంది. బ్రహ్మ చారిగా ఉన్న రాహులు ఓ ఇంటివాడైతే రాజకీయ భవిష్యత్తు ఉంటుదని విశ్లేషకులు భావిస్తున్నారు. 
Rahul Priyanka gandhi
ఒంటరిగా ఉన్న రాహుల్ పెళ్లి చేసుకుంటే రాబోయే ఎన్నికల్లో సతీసమేతంగా ప్రచారం నిర్వహించి  విజయం పొందవచ్చని పార్టీ లో కొందరు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లయితే రాహులు జాతకం మారుతుందా కాంగ్రెస్ పార్టీకీ పూర్వ వైభవం వస్తుందా అనే దాని పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ  నేపథ్యంలో రాహుల్ కు బీజేపీ పెళ్లి చేస్తుందా? రాహులు కు పెళ్లయితే రాజకీయాల్లో రాణిస్తాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పై గెలవాలంటే రాహుల్ పెళ్లి చేసుకోవాలి.. ఒక వేళ రాహులు పెళ్లి చేసుకుంటే అందుకు కారణం బీజేపీయెనే అని విశ్లేషకులు  అనే అవకాశముంది.  

Related posts

గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు: ఉత్తమ్

vimala p

ఎస్.ఎస్.సి నుండి … సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ .. నోటిఫికేషన్..

vimala p

రాజ్‌భవన్‌ పరిసరాల్లో ఆంక్షలు

ashok