telugu navyamedia
రాజకీయ

కాంగ్రెస్ ‘భారత్‌ జోడో యాత్ర’..తండ్రి స్మారకం వద్ద రాహుల్​ ఘన నివాళులు

*కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ దాకా రాహుల్‌ యాత్ర
*మాజీ ప్ర‌ధాని రాజీవీగాంధీకి నివాళుల‌ర్పించిన రాహులు
*12 రోజులు, 150 రోజులు, 3570 కిలోమీట‌ర్లు

2024 టార్గెట్‌గా పార్టీని పూర్వ వైభ‌వం తీసుకురావ‌డంతో పాటు ప్రజలతో తిరిగి మమేకం కావడానికి రాహుల్ గాంధీ సుధీర్ఘ పాదయాత్రకు రెడీ అయ్యారు.

కాంగ్రెస్ తలపెట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి బుధవారం సాయంత్రం ఈ యాత్ర ప్రారంభంకానుంది.

సుమారు 3,570 కి.మీ మేర ఈ భారత్ జోడో యాత్ర సాగనుంది. 12 రాష్ట్రాల్లో దాదాపు150 రోజుల పాటు సాయాత్ర కొన‌సాగ‌నుంది . ఈ యాత్రలో అగ్రనేతలతో సహా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొననున్నారు.

భారత్ జోడో యాత్రకు ముందు శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్‌ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.

Bharat Jodo Yatra: Eye On 2024 Polls, Rahul Gandhi To Launch Mega Congress Yatra Today

తండ్రి స్మారకం వద్ద అంజలి ఘటించిన రాహుల్..

బుధవారం ఉదయం శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని రాహుల్​ సందర్శించారు. తన తండ్రి రాజీవ్​ గాంధీకి ప్రత్యేక నివాళులు అర్పించారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్‌ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.

తండ్రికి అంజలి ఘటించిన రాహుల్​.. అక్కడి నుంచి తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు..కన్యాకుమారి నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘెల్‌ పాల్గొంటారు.

అనంతరం బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. భారత్‌ జోడో యాత్రను బుధవారం లాంఛనంగా ప్రారంభిస్తారని, రాహుల్‌ నడక మాత్రం గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Rahul Gandhi to launch Congress' 'Bharat Jodo Yatra' from Kanyakumari today

మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. పాదయాత్ర సాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. భారతదేశ చరిత్రలో రాహుల్‌ పాదయాత్ర మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.

దేశంలో విభజనవాద రాజకీయాలు, మతోన్మాదంతోపాటు పెరిగిపోతోన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించి.. దేశ ప్రజలను ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

Related posts