telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మమతా.. ర్యాలీకి.. మద్దతు ఇచ్చిన పెద్దలు…

rahul gandhi supports mamata rally in kolkata

మమతా బెనర్జీ రేపు కలకత్తాలో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ ప్రాంతీయ సమస్యలపైన నిరసనే అయినప్పటికీ, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇందులో పాల్గొనాలని ఇప్పటికే ఆయా పార్టీలకు ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు నేడు ఏపీసీఎం చంద్రబాబు కలకత్తా చేరుకోనున్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా బహిరంగ లేఖ ద్వారా ర్యాలీకి మద్దతు ప్రకటించారు. దేశం లోని కోట్లాది మంది ప్రజలు ఆగ్రాహావేశాల కారణంగానే ఈ విపక్షాలు ఏకం అవుతున్నారని రాహల్ అన్నారు. ఈ ప్రజలంతా మోదీ ప్రభుత్వపు బూటకపు హామీలు, అబద్ధాలతో మోసపోయారని వ్యాఖ్యానించారు. మహిళలు, చిన్నారులు, కులం, మతం, భాష అన్న తేడా లేకుండా అందరి మాటకు గౌరవం ఇచ్చే రేపటి భారతం కోసం విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని రాహుల్ పునరుద్ఘాటించారు. హక్కులు, భావజాలాల పరిరక్షణలో బెంగాలీలు ఎప్పుడూ ముందుంటారని రాహుల్ ప్రశంసించారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావడం ద్వారా బలమైన సందేశాన్ని పంపినట్లు అవుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మమత దీ(అక్కా) అంటూ రాసిన లేఖను రాహుల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

మొత్తానికి ఈ ర్యాలీ ద్వారా బీజేపీ యేతర పార్టీలన్నిటిని మరోసారి సమాయత్తం చేసే వేదికగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మరోపక్క మమత గ్రాఫ్ కూడా ఈ ర్యాలీతో ఒక స్థాయికి పెరగనుంది. ప్రధాని అభ్యర్థిత్వానికి ఈ గ్రాఫ్ ఎంతో అవసరం, అది నిరూపించుకోడానికి మరియు బీజేపీకి ప్రాంతీయ పార్టీల బలం, బలగాన్ని చూపించడానికి జరుగుతుంది.. అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు దీనిపై తమతమ అభిప్రాయాలను సుస్పష్టంగా తెలిపారు.

Related posts