telugu navyamedia
రాజకీయ వార్తలు

హెలికాప్టర్ ను రిపేర్ చేసిన రాహుల్!

Rahul was in active politics

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంత సేపు మెకానిక్ గా మారారు. లోక్ సభ ఎన్నికల్లో మరో రెండు విడతల పోలింగ్ మాత్రమే మిగిలిఉండటంతో రాహుల్ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో హెలికాప్టర్ ను రాహుల్ నేలపై పడుకుని రిపేర్ చేస్తూ కనిపించారు.

నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో పర్యటించారు.ఈ సందర్భంగా హెలికాప్టర్ కు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ తో పాటు రంగంలోకి దిగిన రాహుల్ సమస్యను సరిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మంచి టీం వర్క్‌ అంటే అన్ని చేతులు కలిసి పనిచేయడమే. ఉనా పర్యటన సమయంలో మా హెలికాప్టర్‌లో సమస్య ఎదురైంది. మేమంతా కలిసి దాన్ని త్వరగా సరిచేశాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు’ అని రాహుల్ తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts