telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ కు సుప్రీంకోర్టులో ఊరట..బ్రిటన్ పౌరసత్వం పిటిషన్ కొట్టివేత

rahul gandhi to ap on 31st

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందనీ, ఎన్నికల్లో పోటీకి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. బ్రిటన్ కు చెందిన బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీలో రాహుల్ డైరెక్టర్, కార్యదర్శి హోదాలో ఉన్నారని పిటిషనర్, హిందూ మహాసభ సభ్యుడు జై భగవాన్ గోయల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2005-06 అర్ధిక సంవత్సరానికి కంపెనీ వార్షిక ఐటీ రిటర్నులో పౌరసత్వం అనే కాలమ్ లో రాహుల్ బ్రిటిషర్ అని రాశారని వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఓ కంపెనీకి సంబంధించిన పేపర్ ఆధారంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషనర్ ను ప్రశ్నించారు. ఓ కంపెనీ పేపర్ ను ఆధారంగా చేసుకుని కోర్టును ఆశ్రయించడం సరికాదని చెబుతూ పిటిషన్ ను కొట్టివేశారు.

Related posts