రాజకీయ వార్తలు వార్తలు

అవినీతి ప్రధాని రాజీనామా చేయాలి.. : రాహుల్ గాంధీ

rahul gandhi demands modi to resign

అవినీతిపై పోరాటం చేస్తాను అని చెప్పి మోడీ గత ఎన్నికలలో గెలిచారు. ఇప్పుడు ఆయనే రాఫెల్ కుంభకోణంలో పాత్రధారి అయ్యారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీం కోర్టు కూడా ఈ కుంభకోణానికి సంబందించిన వివరాలు ఇవ్వాలని కోరిందని, అందుకే మరో సారి మోడీ ప్రభుత్వం గొంతులో వెలక్కాయ పడినట్టుగా తడబడుతుంది ఆయన అన్నారు. రాఫెల్ విమానాల ధరను బహిర్గతం చేయరాదనే నియమం లేదని, కానీ ప్రభుత్వం కావాలని లేని నియమాన్ని ఉందన్నట్టు కట్టుకధలు చెపుతుందని అన్నారు. సుప్రీం కోర్టు వివరణ కోరగానే రక్షణ మంత్రిని హుటాహుటిన ఫ్రాన్స్ పంపించి విషయాలను తారుమారు చేసేందుకు కృషి బాగానే చేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాటం చేస్తాను అని చెప్పి అధికారం దక్కించుకుని ఇప్పుడు తానే అవినీతిలో బాగస్తుడైన మోడీ ప్రధానిగా కొనసాగటం తగదని, రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.  

ఎటువంటి అర్హతలు లేకుండా కేవలం స్వలాభం కోసమే అనిల్ అంబానీకి మోడీ 30 వేల కోట్ల ప్రాజెక్ట్ ను అప్పనంగా ఇచ్చేశారని రాహుల్ విమర్శించారు. మోడీ స్వయంగా అవినీతికి పాల్పడ్డారనే దానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏమి అవసరం లేదని వారు అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే, డస్సాల్ట్ సంస్థ లోని రెండవ అతిపెద్ద అధికారి కూడా మోడీ అవినీతి పరుడే అని చెప్పారని అన్నారు. సదర్ సంస్థలపై ఒత్తిడి తెచ్చి వివరాలు బయటకు రాకుండా మోడీ తన అవినీతిని దాస్తున్నారని విమర్శించారు. త్వరలో ఈ కుంభకోణానికి సంబంధించి కీలక పత్రాలు తనకు అందుతాయని రాహుల్ చెప్పారు. దీనిపై చర్చకు పిలిస్తే అరుణ్ జైట్లీ పారిపోయారని అన్నారు రాహుల్. ఇక ఇప్పుడు మరింత ఉదృతంగా ఉన్న ఉద్యమం #మీటు గురించి అడిగితే మరోసారి స్పందిస్తానని దాటవేశారు.

Related posts

ఘనంగా ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ

admin

హోదా పై అఖిల పక్షం సమావేశం…

admin

మాజీ ఎంపీ ఆస్తుల వేలం…నోటీసులు ఇచ్చిన బ్యాంకు..60 రోజులే గడువు…

chandra sekkhar

Leave a Comment