telugu navyamedia
రాజకీయ వార్తలు

వ్యక్తిగతంగా హాజరు కావాలి.. రాహుల్‌ గాంధీకి కోర్టు సమన్లు

rahul gandhi fire on modi in campaign

ప్రధాని నరేంద్రమోదీని ‘కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’గా సంభోధించిన కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 3వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రఫేల్‌ ఒప్పందంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్దం జరిగిన విషయం తెలిసిందే.సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్నే రాహుల్‌ ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ మోదీపై రాహుల్ విమర్శలు కురిపించారు. అదే విధంగా గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీని ‘కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’ గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత మహేష్‌ శ్రీమాల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు.

Related posts