telugu navyamedia
రాజకీయ వార్తలు

జాతీయ ప్రయోజనాలను కాపాడటమే కేంద్రం విధి: రాహుల్

Rahul gandhi congress

గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆయన మరోసారి కేంద్రంపై మండిపడ్డారు.ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో వీడియో కాల్ ద్వారా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాట్లాడారు.

చర్చల తర్వాత చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లాయి. అయితే పత్రికా ప్రకటనలో మాత్రంలో మాత్రం గాల్వాన్ లోయలో తప్పు ఎవరు చేశారో చాలా స్పష్టంగా తెలుస్తోందని, తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడూ కట్టుబడే ఉంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జాతీయ ప్రయోజనాలను కాపాడటమే భారత ప్రభుత్వ ప్రధాన విధి అని రాహుల్ అన్నారు. సరిహద్దుల్లో యథాస్థితిని కొనసాగించేందుకు ఎందుకు పట్టుబట్టలేదని ప్రశ్నించారు.

Related posts