telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీతో తమ కుటుంబానికి ఆత్మీయ బంధం: రాహుల్‌

rahul gandhi to ap on 31st

ఏపీతో తమ కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ భరోసా సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి ప్రకటన చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని దుయ్యబట్టారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్ ఏపీకి న్యాయం చేయలేరన్నారు.

ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని నీరుగార్చాలని యత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి కుయుక్తులను సహించేది లేదని అన్నారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల జీవితాన్ని మారుస్తుందన్నారు. అందరికీ కనీస ఆదాయం కల్పించడమే కాంగ్రెస్‌కు లక్ష్యం అని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ మూలాలతో సహా తుడిచిపెట్టుకుపోయిన తరుణంలో మళ్లీ తొలి అడుగులేస్తున్నట్టుగా రాహుల్ ప్రసంగించారు. పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ ను తిరిగి పూర్వ స్థితికి తెచ్చే విధంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Related posts