telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

రక్త హీనతకు మంచి ఆహారం .. రాగిజావ .. తెలుసా..!

raagi java is best than calcium tabletsa
ఈ వేసవిలో త్వరగా నిరసించిపోతుంటారు చాలా మంది. మొదటి నుండి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఈ వేసవి మరింత కఠినంగా ఉంటుంది. దానిని అధిగమించేందుకు అత్యంత సులభమైన మార్గంగా నిపుణులు రాగులను తీసుకోవడమే అంటున్నారు. ఈ రాగులు శ‌రీరానికి ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించే సిరి ధాన్యాల‌లో చాలా ముఖ్య‌మైన‌వి. వీటితో చాలా మంది చాలా ర‌కాల ప‌దార్థాల‌ను చేసుకుని తింటుంటారు. అయితే రాగుల‌తో జావ చేసుకుని తాగితే దానితో ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం. 
*  రాగి జావ‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.
*  రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది.
raagi java is best than calcium tabletsa
*  రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రాగులను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి.
*  రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
*  అధిక బరువును తగ్గించడంలో, శరీరానికి మానసిక ప్రశాంతతను అందజేయడంలో రాగులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తలనొప్పి తగ్గుతుంది. డిప్రెషన్, ఆందోళనను నివారించే గుణాలు రాగుల్లో ఉంటాయి.

Related posts