telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం జగన్ కు సవాల్ విసిరిన రఘురామకృష్ణంరాజు..

Raghuramakrishnaraju ycp mp

సీఎం జగన్ పై మరోసారి ఫైర్ అయ్యారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు రఘురామకృష్ణంరాజు. సబ్ ఆర్డినేట్ ఆఫ్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి కాలం ముగిసిందని..అది తెలియని ప్రభుత్వ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటున్నదని మండిపడ్డారు. మూడు నెలల క్రితమే ఆ పదవి నుంచి నన్ను తొలగించాలని స్పీకర్ కు లేఖ ఇచ్చారని…అది సంసంవత్సరం పదవి కాలం అని, మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారన్నారు. తన పదవి కాలం అయిపోయింది కాబట్టి, దానిని మా పార్టీకే చెందిన బాలశౌరికి ఇవ్వాలని పార్టీ ప్రభుత్వం లెటర్ ఇచ్చిందని స్పష్టం చేశారు.

రెడ్లకు పదవులు ఇవ్వడం అయిపోయింది కాబట్టి, ఆయన మతానికి చెందిన వారికి ఆ పదవి ఇచ్చారని.. బాలశౌరికి ఆ పదవి ముష్టి వేసారని పేర్కొన్నారు. త్వరలో తనపై అనర్హత వేటు వేయిస్తామని పిచ్చి రాతలు రాయిస్తున్నారని…తనను ఎవరూ తొలగించలేరు.. వారికి సవాల్ విసురుతున్నానని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కు కూడా సవాల్ విసురుతున్నానని.. అమరావతిపై రెఫరెండం పెడితే, రెండులక్షల ఓట్లు తేడాతో గెలుస్తాను..జగన్ నిలుచున్నా సరేన్నారు. ఇది అతిశయోక్తితో చెబుతున్నది కాదని..ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుందన్నారు. పదవి నుంచి తొలగించడమంటే అది వేరుగా ఉంటుంది.. అది ప్రజలే చూస్తారనే తెలిపారు.

Related posts