telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బిజెపి అంటే హరీష్ రావుకు ఎందుకంత భయం : రఘునందన్ రావు

Raghunandan

దుబ్బాక రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా..దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. “దుబ్బాకలో బిజెపి లేనేలేదని మాట్లాడిన నువ్వు ముగ్గురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు వందమంది కానిస్టేబుల్లను మోహరించి తనిఖీల పేరుతో అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నవ్ హరీష్ రావు..? ” అంటూ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బిజెపి అంటే హరీష్ రావుకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. నీ పోలీసులతో నాలుగున్నర గంటలు నా వాహనాన్ని ఇప్పదీసి.. పార్టులన్ని బయట పెట్టినా వంద రూపాయలు కూడా దొరకలేదు, ఇలాంటి చర్యలతో హరీష్ రావు సాధించేది ఏమి లేదు దుబ్బాక ప్రజల ఆగ్రహం తప్ప అని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గానికి రాకరాక ఒక్క పాలిటెక్నీక్ కాలేజ్ వస్తే సిద్దిపేటకు ఎత్తుకుపోయిండు హరీష్ రావు అని ఫైర్ అయ్యారు. దుబ్బాక గడ్డపై బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రఘునందన్ రావు.

Related posts