telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రఘురామకృష్ణంరాజు అరెస్ట్ : కీలక విషయాలు వెలుగులోకి !

Raghuramakrishnaraju ycp mp

గుంటూరులో నేడు మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజును విచారించనున్నారు సీఐడీ అధికారులు. నిన్న ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకోసం తరలించారు. అర్థరాత్రి ఒంటిగంట వరకూ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారని ప్రశ్నించిన సీఐడీ అధికారులు..ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణం రాజును ప్రశ్నించారు. విచారణలో కొన్ని కీలక అంశాలను రాబట్టిన సీఐడీ అధికారులు.. రఘురామకృష్ణంరాజు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

Related posts