telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుమలలో జగన్ సంతకం చేయాలి: రఘురామకృష్ణరాజు

Raghuramakrishnaraju ycp mp

తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు ఇకపై డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. తాజాగా ఈ ప్రకటనపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. గతంలో గంగాస్నానం చేసినప్పుడు ఎంతోమంది జగన్ ను నమ్మారని తెలిపారు.

కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో పక్కన కేవలం బైబిల్ మాత్రమే ఉండడంతో ఆయనపై క్రైస్తవుడు అనే ముద్ర పడిందని స్పష్టం చేశారు. బైబిల్ ను పక్కనబెట్టుకోవడంలో తప్పులేదని, ఎవరి విశ్వాసాలు వారివని అన్నారు.

నేపథ్యంలో డిక్లరేషన్ పై సంతకం పెడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న సీఎం జగన్ డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని రఘురామ హితవుపలికారు. 

Related posts