• Home
  • Trending Today
  • ఆ సింగర్ పై లైంగిక దాడి చేసింది నిజమే… నిజం ఒప్పుకుంటున్నానంటూ పోస్టులు వైరల్
Trending Today వార్తలు సినిమా వార్తలు

ఆ సింగర్ పై లైంగిక దాడి చేసింది నిజమే… నిజం ఒప్పుకుంటున్నానంటూ పోస్టులు వైరల్

raghu dixit

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి #మీటూ పేరుతో ఈమధ్య కాలంలో బయటకొచ్సినన్ని ఆరోపణలు ఇంతకుముందెన్నడూ రాలేదు. నటీనటుల నుంచి సింగర్స్, క్రీడాకారిణులు వరకు అందరూ తమకు జరిగిన అన్యాయం గురించి దైర్యంగా చెబుతున్నారు.

ఇటీవల సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇటీవల కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ ఒకసారి తన స్నేహితురాలిని ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీలో ఆ న్యూస్ వైరల్ గా మారిపోయింది. అయితే రఘు దీక్షిత్ ఆమె చేసిన ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకోవడం గమనార్హం.

“నేను లైంగిక దాడి చేసింది నిజమే… అందుకు బహిరంగంగా ఆ అమ్మాయిని క్షమాపణలు కోరుతున్నా. చిన్మయి చెప్పిన ఒక సింగర్ తో నిజంగానే తప్పుగా ప్రవర్తించాను. పాట రికార్డింగ్ టైమ్ లో ఉద్వేగానికి లోనై కౌగిలించుకున్నాను. ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో వెనక్కి తగ్గాను. అయితే అప్పుడే ఆమెకు క్షమాపణలు చెప్పాను. మరోసారి బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నా… ఈ సందర్భంగా నా భార్యను కూడా క్షమాపణలు కోరుతున్నాను” అంటూ బహిరంగ క్షమాపణలు కోరారు.

Related posts

వాకింగ్ లో రకాలు…🤣🤣🤣🤣

chandra sekkhar

సభకు రానివారికి జీతభత్యలెందుకు…?ప్రతిపక్షాలంటే ఇవేనా..? యనమల ఆగ్రహం

nagaraj chanti

మద్యం మత్తులో పక్కింటి తలుపు కొట్టి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి

jithu j

Leave a Comment