telugu navyamedia
సినిమా వార్తలు

నాగ శౌర్యను పరామర్శించిన దర్శకేంద్రుడు

ఇటీవ‌ల టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య‌ యాక్ష‌న్ సీన్‌లో భాగంగా గాయ‌పడిన విషయం తెలిసిందే. నాగశౌర్య కొత్త చిత్రం షూటింగ్ కోసం చిత్రబృందం విశాఖ‌లోని అరిలోవా ప్రాంతానికి వెళ్లింది. అక్క‌డ ప‌ద‌కొండు రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశారు. కాని అనుకోకుండా ఇలాంటి అప‌శృతి చోటు చేసుకుంది. కేజీఎఫ్ సినిమాతో గుర్తింపు పొందిన స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా 15 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌పై నుండి నాగ‌శౌర్య కింద‌కి దూకే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆయ‌న స‌రైన ప్ర‌దేశంలో ల్యాండింగ్ కాక‌పోవ‌డంతో అత‌ని మోకాలికి గాయ‌మైంది. ఆయ‌న ఎడ‌మ కాలికి తీవ్ర‌గాయ‌మైంది. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వైద్యులు 25-30 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగ‌శౌర్య‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు, ర‌చ‌యిత‌ బీవీఎస్ ర‌వి కలిసి ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌రామర్శించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశించారు. ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరోలంతా వరుసగా గాయపడిన విషయం తెలిసిందే.

Related posts