telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

ఎయిర్ షో లో తళుక్కుమన్న.. రాఫెల్ యుద్ధ విమానం..

rafel fighter plane in ero india 2019

కేంద్రప్రభుత్వంపై ప్రధాన విమర్శలలో ఒకటైన రాఫెల్ యుద్ధ విమానం బెంగుళూరు లో తళుక్కుమంది. అక్కడ జరిగే ఎయిర్ షో లో ఈ విమానాన్ని కూడా ప్రదర్శనకు ఉంచారు. ఏరో ఇండియాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ జెట్ ఫైటర్లను బెంగళూరుకు తరలించారు. ఏరో షోకు సన్నాహకంగా నిన్న జరిగిన విన్యాసాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సూర్య కిరణ్ ఏరోబేటిక్ విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ దుర్మరణం పాలయ్యారు. ఆయన మరణానికి సంతాపంగా రాఫెల్ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు. ప్రమాదం నేపథ్యంలోనే సూర్య కిరణ్ ఏరోబేటిక్స్ బృందం ప్రదర్శనకు దూరంగా ఉంది.

రాఫెల్‌తో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తేజస్ కూడా ప్రదర్శనలో పాల్గొంది. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు తేజస్‌ను భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ నామకరణం చేశావరు. ఈ సందర్భంగా అటల్‌‌జీకి నివాళుర్పించారు.

Related posts