telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

ముల్లంగిలో .. ఆరోగ్య .. రహస్యాలు..

radish and its health benefits

రాడిష్ (ముల్లంగి) దుంపజాతికి చెందినది. దుంపలలో ఉన్న అన్ని ప్రయోజనాలు దీనివలన లభిస్తాయి. అయితే ఇతరములతో పోల్చినపుడు దీని ప్రయోజనాలు ఎక్కువే అని చెప్పాలి. ముల్లంగి దుంపల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఇది అంతరుచిగా ఉండదని చాలామంది తినరు. దీనిలో దుంపతో పాటుగా ఆకులను కూడా ఆహారంగా తీసుకుంటారు. ఈ ఆకులలో కూడా క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. దుంపలతోపాటు ఆకులను కూడా కలిపి వండుకుని తింటే ఇంకా మంచిది. ఇటీవల గోదుమగడ్డి, ఉల్లి కాడలు ఎలా అయితే ఆహారంగా తీసుకోబడుతున్నాయో.. ఈ ముల్లంగి తోపాటుగా వాటి ఆకులను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. అసలు ముల్లంగి.. దాని ప్రయోజనాలు ఏమితో తెలుసుకుందా…

* ముల్లంగిని జ్యూస్‌గా తీసుకుని తాగుతుంటే లివర్‌లో కలిగే వ్యాధులను నివారిస్తుంది.

* ముల్లంగి ఆకుల్ని, దుంపని ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని ఒక చెంచా చొప్పున తేనెలో కలిపి తీసుకుంటుంటే ఏ అవయంలో వాపు, నొప్పులున్నా నివారణమవుతాయి.

* పచ్చిముల్లంగి దుంపలు, ఆకుల రసాన్ని తీసి త్రాగుతుంటే సాఫీగా విరేచనమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతూ ఆకలిని కూడా వృద్ధిచేస్తుంది. లివర్ వ్యాధులను తగ్గిస్తుంది.

* ముల్లంగి విత్తులను బాగా ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని రోజూ కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

* ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు కొంచెం ముల్లంగిరసాన్ని త్రాగితే వెంటనే తగ్గిపోతాయి.

* విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే త్వరగా ఈ దోషాలు నివారణమవుతాయి.

* మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళను కరిగించడానికి ముల్లంగి ఎంతో మంచిది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తింటే ఈ సమస్య నివారణమవుతుంది.

* ముల్లంగి రసంతీసి, దానిలో నాలుగోవంతు నూనెవేసి, నూనె మాత్రమే మిగిలేంతగా కాచి ఆ నూనెను భద్రం చేసుకోవాలి. నూనెను వడ గట్టాలి. చెవిపోటు, చెవిలో హోరు మొదలైన బాధలున్నవారు, చెవిలో కొంచెం ఈ నూనెను పోస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కీళ్ళవాపులు, నొప్పులు కలిగిన చోట ఈ నూనెను మర్థనా చేస్తే వాపులు, నొప్పులు తగ్గుతాయి.

Related posts